నేష‌న‌ల్ గేమ్ప్ లో ప‌సిడితో మెరిసిన తెలంగాణ షూట‌ర్ ఈషా సింగ్

01-10-2022 Sat 21:26
  • షూటింగ్‌లో స‌త్తా చాటిన ఈషా సింగ్‌
  • 25 మీట‌ర్ల స్పోర్ట్స్ పిస్ట‌ల్‌లో ప‌సిడి ప‌త‌కం కైవ‌సం
  • తెలంగాణ ఖాతాలో చేరిన తొలి ప‌త‌కం
telangana shooter esha singh wins gold medal in national games
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న జాతీయ క్రీడ‌ల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. ఇప్ప‌టికే మహిళల 100 మీటర్ల ప‌రుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలంగాణ‌కు చెందిన మహిళా షూట‌ర్ ఈషా సింగ్ స‌త్తా చాటింది. 

25 మీట‌ర్ల స్పోర్ట్స్ పిస్ట‌ల్ ఈవెంట్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించిన ఈషా సింగ్ తెలంగాణ ఖాతాలో తొలి ప‌త‌కాన్ని చేర్చింది. వెర‌సి జాతీయ క్రీడ‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో రెండు ప‌సిడి ప‌త‌కాలు ఒకే రోజు చేరాయి. అంతేకాకుండా ఈ రెండు ప‌త‌కాల‌ను సాధించింది మ‌హిళా క్రీడాకారులే కావ‌డం గ‌మ‌నార్హం.