'పొన్నియ‌న్ సెల్వ‌న్' పాత్ర‌లో అశ్విన్‌... చిత్రాన్ని మెచ్చుకుంటూ క్రికెట‌ర్ పోస్ట్‌

01-10-2022 Sat 20:31
  • శుక్ర‌వారం విడుద‌లైన పొన్నియ‌న్ సెల్వ‌న్‌
  • చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ అశ్విన్ వ‌రుస ట్వీట్లు
  • ఓ పాత్ర‌ధారి వేషంలో క‌నిపిస్తూ వీడియోను విడుద‌ల చేసిన వైనం
team india cricketer qshwin tweets on ponnian selvan movie
దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై మిశ్ర‌మ స్పంద‌న వినిపిస్తున్నా... వ‌సూళ్లు మాత్రం భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై టీమిండియా క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ శ‌నివారం సాయంత్రం ట్విట్ట‌ర్ వేదికగా వ‌రుస ట్వీట్లు పోస్ట్ చేశాడు. సినిమాను ఆకాశానికెత్తేసిన అశ్విన్‌... మ‌ణిర‌త్నం ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని కీర్తించాడు.

ప‌నిలో ప‌నిగా పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో చాలా మంది ప్ర‌ముఖ న‌టులు ఉన్నార‌ని తెలిపిన అశ్విన్‌... మీ అభిమాన న‌టుడు ఎవ‌రు అంటూ ఓ ప్ర‌శ్న సంధించాడు. అంతేకాకుండా సినిమాలోని ఓ ప్ర‌ధాన పాత్ర వేష‌ధార‌ణ‌లో క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 19 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల‌ను చ‌దువుతూ అశ్విన్ క‌నిపించాడు.