ఉన్న దరిద్రం చాలదన్నట్టు కేసీఆర్ ఇప్పుడు దేశంపై పడుతున్నారట: వైఎస్ షర్మిల

01-10-2022 Sat 19:07
  • త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీ
  • సెటైర్లు వేసిన షర్మిల
  • ఏ వర్గాన్ని కేసీఆర్ ఆదుకోలేదని విమర్శలు
YS Sharmila satires on CM KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీ ప్రారంభిస్తుండడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. ఉన్న దరిద్రం చాలదన్నట్టు ఇప్పుడు కేసీఆర్ దేశంపై పడతారట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. 

ప్రజాసమస్యలను, రైతులను కేసీఆర్ పట్టించుకోవడంలేదని షర్మిల విమర్శించారు. తెలంగాణలో ఏ వర్గాన్ని అయినా కేసీఆర్ ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. కాగా, షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు కొనసాగుతోంది. ఆందోల్ నియోజకవర్గం చింతకుంటలో ప్రారంభమై చండూర్, చిట్కూల్ మీదుగా సాగుతోంది.