వీడియో గేమ్ ఆడిన మోదీ.. వీడియో ఇదిగో

01-10-2022 Sat 15:19
  • 5జీ సేవలను ప్రారంభించిన మోదీ
  • టెలికాం కంపెనీల స్టాళ్లను సందర్శించిన పీఎం
  • 5జీ ఉత్పత్తుల వివరాలను ప్రధానికి వివరించిన టెలికాం సంస్థల ప్రతినిధులు
Modi plays video game
ప్రధాని మోదీ ఈరోజు 5జీ సేవలను ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కు హాజరయ్యారు. 5జీ సేవలను ప్రారంభించడానికి ముందు టెలికాం కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. జియో, ఎయిర్ టెల్ తదితర కంపెనీలు ప్రదర్శిస్తున్న 5జీ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. సంబంధిత కంపెనీల ప్రతినిధులు ప్రధానికి వాటి గురించి వివరించారు. మరోవైపు, ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో గేమ్ కూడా ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.