room rent: ఇక్కడి జైల్లో రూమ్ ను అద్దెకు తీసుకోవచ్చు!

You can rent a room in this Uttarakhand jail for just Rs 500 per day
  • ఒక రోజు అద్దె రూ.500
  • ఎన్ని రోజుల పాటైనా ఉండొచ్చు
  • జాతకంలో జైలుకు వెళ్లే దోషం ఉన్న వారికి ఊరట
  • ఉత్తరాఖండ్ లోని హల్ద్ వానీ జైలు కొత్త ప్రయత్నం
జైలులో ఖైదీలకే మాత్రమే చోటు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేరారోపణలు, నేరం నిరూపితమైన వారే ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఉత్తరాఖండ్ లోని హల్ద్ వానీ జైలు మాత్రం ప్రత్యేకం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి జైల్లో నేరం చేయని వారు సైతం ఉండొచ్చు. ఒక రూమ్ కు ఒక రోజు అద్దె కింద రూ.500 వసూలు చేస్తారు. 

కొందరు జాతకాన్ని బలంగా విశ్వసిస్తారు. తమ జాతకంలో జైలుకు వెళ్లే దోషం ఉందని తెలిస్తే, నేరం చేసి వెళ్లే దానికంటే.. ఇలా అద్దెకు తీసుకుని ఆ దోషం తీరినట్టు అనిపించుకునే అవకాశాన్ని జైలు అధికారులు ఈ రూపంలో కల్పిస్తున్నారు. రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తూ ఎన్ని రోజుల వరకైనా జైలులో ఉండి వెళ్లొచ్చు. దీనికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
room rent
uttarakand jail
Rs 500

More Telugu News