అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ యాత్ర‌... రేపు డీజీపీని క‌లిసి అనుమ‌తి కోర‌తామ‌న్న రేవంత్ రెడ్డి

30-09-2022 Fri 21:44
  • క‌ర్ణాట‌క‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ యాత్ర‌
  • తెలంగాణ‌లో యాత్ర‌పై స‌మీక్ష నిర్వ‌హించిన రేవంత్ రెడ్డి
  • యాత్ర కోసం స‌బ్ క‌మిటీలు ఏర్పాటు చేయ‌నున్నట్లు వెల్ల‌డి
tpcc chief revanth reddy reviews on rahul gandhi yatra
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర పేరిట చేప‌ట్టిన పాద‌యాత్ర శుక్ర‌వారం కేర‌ళ నుంచి క‌ర్ణాట‌క‌లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క‌లో యాత్ర‌ను ముగించుకున్న అనంత‌రం ఏపీ మీదుగా రాహుల్ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశిస్తుంది. అక్టోబ‌ర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణ‌లోకి అడుగుపెట్ట‌నుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... రాహుల్ పాద‌యాత్ర‌పై కీల‌క నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను దిగ్విజ‌యం చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం స‌బ్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని ఆ క‌మిటీల‌కు పార్టీ సీనియ‌ర్ల‌ను ఇంచార్జీలుగా నియ‌మిస్తామ‌ని తెలిపారు. ఇక తెలంగాణ‌లో రాహుల్ పాద‌యాత్ర‌కు అనుమ‌తి కోసం శ‌నివారం డీజీపీని క‌ల‌వ‌నున్న‌ట్లు రేవంత్ తెలిపారు.