'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

30-09-2022 Fri 21:05
  • పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో 'హరిహర వీరమల్లు'
  • హీరోయిన్ గా నిధి అగర్వాల్
  • నేడు సరస్వతి పంచమి
  • వర్క్ షాప్ ఏర్పాటు చేసిన చిత్రబృందం
Pawan Kalyan attends Harihara Veeramallu workshop
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. 

కాగా, ఇవాళ (సెప్టెంబరు 30) సరస్వతి పంచమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, హీరోయిన్ నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు పూర్తయిన చిత్రీకరణ, తదుపరి షెడ్యూల్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 
అంతకుముందు, యూనిట్ సభ్యులు సరస్వతి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను హీరోయిన్ నిధి అగర్వాల్ పంచుకున్నారు. అక్టోబరు రెండో వారం నుంచి భారీ షెడ్యూల్ జరగనుందని నిధి వెల్లడించారు. ఈ షెడ్యూల్ కు సంబంధించి నేటి వర్క్ షాప్ లో చర్చించినట్టు వివరించారు.