ఒక్క చాన్స్ వస్తే... వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా: పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ రిక్వెస్ట్

30-09-2022 Fri 19:54
  • పవన్ ఫొటో పంచుకున్న బండ్ల గణేశ్
  • రెడ్ టీషర్టు, స్లిమ్ ఫిట్ జీన్స్ లో ఉన్న పవన్
  • బాస్ ను చూస్తుంటే రక్తం ఉరకలేస్తోందన్న బండ్ల గణేశ్
  • ముద్దొస్తున్నావ్ బాస్ అంటూ ట్వీట్
Bandla Ganesh requests Pawan Kalyan one chance
రెడ్ టీ షర్టు, స్లిమ్ ఫిట్ జీన్స్ లో ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోను ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. "అబ్బబ్బ... మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలైంది... రక్తం ఉరకలేస్తోంది" అంటూ తన స్పందనను వెలిబుచ్చారు. 

అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ను రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే, వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. అబ్బ... ముద్దొస్తున్నావ్ బాస్ అంటూ తన సంతోషాన్ని మరోసారి వ్యక్తం చేశారు. 

కాగా, బండ్ల గణేశ్ పంచుకున్న ఫొటో... పవన్ హరిహర వీరమల్లుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నప్పటిదిగా తెలుస్తోంది.