ఆట ఏదైనా.. ధోనీ ఛాయిస్ హెలికాప్ట‌ర్ షాటే!

30-09-2022 Fri 19:05
  • అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ
  • రాంచీలో సేంద్రియ సాగుతో సేద‌తీరుతున్న కెప్టెన్ 
  • గోల్ఫ్ ఆడుతూ క‌నిపించిన ధోనీ
  • హెలికాప్ట‌ర్ షాట్ మాదిరే గోల్ఫ్ షాట్ కొట్టిన వైనం
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
ms dhoni spotted in golf course
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి చాలా కాల‌మే అయినా... అత‌డికి సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యం ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉంటుంది. మైదానంలో శాంత‌మూర్తిగా క‌నిపించి కెప్టెన్ కూల్ బిరుదును సార్ధ‌కం చేసుకున్న ధోనీ... ఇత‌ర‌త్రా వ్యాపకాల్లో మునిగిపోయాడు. త‌న సొంతూరు రాంచీలో సేంద్రియ సాగులో సేద‌దీరుతున్న ధోనీ తాజాగా గోల్ఫ్ ఆడుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.

కేవ‌లం 10 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియోలో గోల్ఫ‌ర్ అవ‌తారంలో క‌నిపించిన ధోనీ.. బంతిని గోల్ఫ్ స్టిక్‌తో త‌న శ‌క్తి మేర కొట్టాడు. ఆ త‌ర్వాత మ‌రో చిన్న షాట్ ఆడాడు. క్రికెట్‌లో ధోనీ మార్కు షాట్‌కు హెలికాప్ట‌ర్ షాట్ అనే పేరున్న సంగ‌తి తెలిసిందే. క్రికెట్‌లో త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన హెలికాప్ట‌ర్ షాట్ మాదిరే గోల్ఫ్‌లోనూ అత‌డు అదే రీతిలో బంతిని కొట్టాడు. వెర‌సి ఆట ఏదైనా త‌న ఛాయిస్ మాత్రం హెలికాప్ట‌ర్ షాటేన‌ని ధోనీ నిరూపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.