'ఆయుష్మాన్ భార‌త్‌'లో ఏపీకి 6 అవార్డులు

30-09-2022 Fri 18:27
  • కేంద్రం ఆధ్వ‌ర్యంలో అమ‌లవుతున్న ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్‌
  • ప‌థ‌కాన్ని మెరుగైన రీతిలో అమ‌లు చేసినందుకు ఏపీకి అవార్డులు
  • వైద్య, ఆరోగ్య శాఖ స‌మీక్ష‌లో సీఎం జ‌గ‌న్‌కు తెలిపిన విడ‌ద‌ల ర‌జ‌నీ
andhra pradesh bags 6 awards in implimentation of Ayushman Bharat Digital Mission
కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్ (ఏబీడీఎం)లో ఆంధ్రప్ర‌దేశ్ స‌త్తా చాటింది. ప‌థ‌కం అమ‌లులో అత్యుత్త‌మంగా రాణించిన ఏపీ ప్రభుత్వం 6 అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. ఈ మేర‌కు శుక్ర‌వారం వైద్య‌, ఆరోగ్య శాఖ‌పై జ‌రిగిన స‌మీక్ష‌లో భాగంగా కేంద్రం అందించిన అవార్డుల గురించి ఆ శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలిపారు. 

ఏపీలో ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని మెరుగైన రీతిలో అమ‌లు చేసిన తీరుకు గానూ ఈ అవార్డులు వ‌చ్చిన‌ట్లు ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఏకంగా 6 అవార్డులు వ‌చ్చేలా ప‌నిచేసిన వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.