వైసీపీ ఎమ్మెల్సీతో క‌లిసి షాపింగ్ మాల్ ప్రారంభించిన బీజేపీ నేత స‌త్య‌కుమార్‌

30-09-2022 Fri 18:13
  • వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన బీజేపీ నేత స‌త్య‌కుమార్‌
  • కాసేపటికే వైసీపీ ఎమ్మెల్సీతో క‌లిసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన బీజేపీ నేత‌
  • ఫొటోల‌ను తానే స్వ‌యంగా విడుద‌ల చేసిన స‌త్య‌కుమార్‌
bjp leader y satya kumar unaugurates a shopping mall in guntur with ysrcp mlc
ఏపీలో అధికార పార్టీ వైసీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించిన రోజే బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై.స‌త్య‌కుమార్‌... అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీతో క‌లిసి ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వంలో పాలుపంచుకున్నారు. బీజేపీ ఏపీ శాఖ చేప‌ట్టిన ప్ర‌జా పోరులో పాల్గొనేందుకు గుంటూరు వ‌చ్చిన స‌త్య‌కుమార్‌... వైసీపీని నిషేధిత పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోల్చిన సంగ‌తి తెలిసిందే. 

ఆ త‌ర్వాత గుంటూరులో నూత‌నంగా ఏర్పాటు చేసిన శుభ‌మ‌స్తు షాపింగ్ మాల్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌తో క‌లిసి ఆయ‌న షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. స‌త్య‌కుమార్‌, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ ప‌క్క‌ప‌క్క‌నే నిలుచుని మ‌రీ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ ఫొటోల‌ను స‌త్య‌కుమారే త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.