కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో

30-09-2022 Fri 16:48
  • గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • అహ్మ‌దాబాద్ నుంచి గాంధీ న‌గ‌ర్‌కు రోడ్డు మార్గం మీదుగా వెళ్లిన వైనం
  • అంబులెన్స్ వ‌స్తున్న విషయాన్ని గ‌మ‌నించి కాన్వాయ్‌ను ఆపివేయించిన మోదీ
  • అంబులెన్స్ వెళ్లాక దాని వెనకాలే క‌దిలిన మోదీ కాన్వాయ్‌
pm modi stops his convoy to give way to the ambulence
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నాటి గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌ధాని వెళుతున్న మార్గంలో ఆయ‌న కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ వ‌స్తుండ‌గా... దానిని గ‌మ‌నించిన ప్ర‌ధాని త‌న కాన్వాయ్‌ను రోడ్డుపైనే నిలిపివేయించి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. అంబులెన్స్ త‌న కాన్వాయ్‌ను దాటిన త‌ర్వాత మోదీ త‌న కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు.

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గాంధీ న‌గ‌ర్‌- ముంబైల మ‌ధ్య సెమీ హైస్పీడ్ వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ఢిల్లీ నుంచి తొలుత అహ్మ‌దాబాద్ చేరుకున్న మోదీ... అహ్మ‌దాబాద్ నుంచి రోడ్డు మార్గం మీదుగా గాంధీ న‌గ‌ర్‌కు బ‌య‌లుదేరారు. అలా కొంత‌దూరం వెళ్ల‌గానే... త‌న కాన్వాయ్ వెనుకాల అంబులెన్స్ వ‌స్తున్న విషయాన్ని గుర్తించిన మోదీ... త‌న కాన్వాయ్‌ను రోడ్డుకు ఎడ‌మ ప‌క్క‌గా ఆపించి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.