వేలికి కనిపించని వెడ్డింగ్ రింగ్... దీపిక, రణవీర్ విడిపోతున్నారా?

30-09-2022 Fri 16:37
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపిక, రణవీర్
  • ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం
  • విడాకులు తీసుకుంటున్నారంటూ ఇటీవలే ఉమైర్ సంధూ ట్వీట్
Are Deepika Padukone and Ranvir Singh taking divorce
బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లపై కొన్ని రోజులుగా ఒక ప్రచారం జరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారనేదే ఆ ప్రచారం. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, కొంత కాలంగా ఎడమొహం, పెడమొహంలా ఉన్నారని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ ఇటీవలే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు... ఈ ఉదయం దీపిక తన తల్లితో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దీపిక చేతికి ఉండాల్సిన వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. దీంతో, ఈ జంట విడిపోతోందనే వార్త నిజమేనని పలువురు నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.