ఏపీ టెట్ ఫ‌లితాల్లో విచిత్రం... ప‌లువురు అభ్య‌ర్థుల‌కు గరిష్ఠం కంటే ఎక్కువ‌గా వ‌చ్చిన మార్కులు

ఏపీ టెట్ ఫ‌లితాల్లో విచిత్రం... ప‌లువురు అభ్య‌ర్థుల‌కు గరిష్ఠం కంటే ఎక్కువ‌గా వ‌చ్చిన మార్కులు

some candidates got above full marks in ap tet
  • టెట్ రాసిన 4 ల‌క్ష‌ల మందికి పైగా అభ్య‌ర్థులు
  • 58.07 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించిన వైనం
  • నార్మ‌లైజేష‌న్ పధ్ధతి వ‌ల్లే గరిష్ఠం కంటే ఎక్కువ వ‌చ్చాయ‌న్న అధికారులు
ఏపీలో ఇటీవ‌లే నిర్వ‌హించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు శుక్ర‌వారం విడుదలయ్యాయి. దాదాపుగా 4 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా...  58.07 శాతం మంది అభ్య‌ర్థులు అర్హత సాధించారు. ఈ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించిన కార‌ణంగా నార్మలైజేషన్‌ విధానాన్ని అనుస‌రించి ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన‌ట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్ కుమార్ తెలిపారు. 

ఇదిలా ఉంటే ఈ ప‌రీక్షా ఫ‌లితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఫ‌లితాల్లో ప‌లువురు అభ్య‌ర్థుల‌కు గరిష్ఠం కంటే అధికంగా మార్కులు వ‌చ్చాయి. దీంతో ఫ‌లితాల‌పై గంద‌ర‌గోళం నెల‌కొంది. గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు ఎలా వ‌చ్చాయంటూ అభ్య‌ర్థులు ఆందోళన వ్య‌క్తం చేశారు. అయితే ఈ ప‌రీక్ష‌లో అవ‌లంబించిన నార్మలైజేష‌న్ పధ్ధతి వ‌ల్లే ఈ పొర‌పాటు జ‌రిగిన‌ట్లుగా అధికారులు తెలిపారు.
Andhra Pradesh
AP TET
Normalisation
TET Tesults

More Telugu News