ఆర్బీఐ నిర్ణయంతో దూసుకుపోయిన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్

30-09-2022 Fri 16:17
  • రెపో రేటును ఆర్బీఐ పెంచడంతో దూసుకెళ్లిన మార్కెట్లు
  • 1,017 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 276 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత ఏడు సెషన్ల పాటు నష్ట పోయిన మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. రెపో రేటును అర శాతం పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017 పాయింట్లు పెరిగి 57,427కి ఎగబాకింది. నిఫ్టీ 276 పాయింట్లు కోలుకుని 17,094కు చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.49%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.78%), బజాజ్ ఫైనాన్స్ (3.28%), కోటక్ బ్యాంక్ (3.22%), టైటాన్ (2.95%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.26%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.58%), ఐటీసీ (-0.32%), టెక్ మహీంద్రా (-0.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.18%).