Vijayasai Reddy: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు పనితీరు ఆధారంగానే ఉంటుంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says YCP MLA tickets will be distributed only on performance based
  • వచ్చే ఎన్నికల నేపథ్యంలో విజయసాయి ట్వీట్
  • ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా పరిశీలిస్తామని వెల్లడి
  • అంచనాలకు అనుగుణంగా పనిచేసిన వారికే టికెట్ అని స్పష్టీకరణ
తమ నియోజకవర్గాల్లో తిరగని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ గట్టిగా మందలించారంటూ వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్లు కేవలం పనితీరు ఆధారంగానే కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. 

అందరు ఎమ్మెల్యేల పనితీరును క్షుణ్ణంగా సమీక్షిస్తామని, తమ నియోజకవర్గాల్లో అంచనాలకు అనుగుణంగా పనిచేసినవారికే ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని విజయసాయిరెడ్డి వివరించారు. పనిచేయండి లేకపోతే వెళ్లిపోండి అనేది సీఎం జగన్ పారదర్శక ప్రభుత్వ సిద్ధాంతం అని పేర్కొన్నారు.
Vijayasai Reddy
MLA Tickets
YSRCP
CM Jagan

More Telugu News