Telangana: కేసీఆర్ పర్యటనల కోసం ప్ర‌త్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్న‌ టీఆర్ఎస్‌

  • 12 సీట్లు క‌లిగిన చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలుకు నిర్ణ‌యం
  • రూ.80 కోట్ల‌ను వెచ్చించనున్న టీఆర్ఎస్‌
  • విమానం కొనుగోలుకు నిధుల‌ను విరాళాల ద్వారా సేక‌రించాల‌ని నిర్ణ‌యం
  • కేసీఆర్ దేశ‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల కోస‌మే విమానం కొనుగోలు
trs planning to buy a special flight for kcr

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ గురువారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ చార్టెర్డ్ ఫ్లైట్ (ప్ర‌త్యేక విమానం) కొనుగోలు చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. ఇందుకోసం ఏకంగా రూ.80 కోట్ల‌ను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధ‌ప‌డింది. 12 సీట్ల‌తో కూడిన ఈ విమానం కోనుగోలుకు సంబంధించి ద‌స‌రా ప‌ర్వ‌దినాన ఆర్డ‌ర్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణ‌యించింది. ఈ విమానం కొనుగోలుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను విరాళాల ద్వారా సేక‌రించాల‌ని కూడా ఆ పార్టీ తీర్మానించింది. ఈ క్ర‌మంలో విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేత‌లు పోటీ ప‌డుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే... సొంత విమానం క‌లిగిన రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌నుంది.

ద‌స‌రా రోజున (అక్టోబ‌ర్ 5) టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంతో పాటు పార్టీ ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే దేశ రాజ‌కీయాల్లోకి పార్టీకి ప్ర‌వేశం క‌ల్పిస్తూ పార్టీకి కొత్త పేరును ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ పేరు ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప్ర‌త్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డ‌ర్ వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీ ఖ‌జానాలో ఇప్ప‌టికే రూ.865 కోట్ల మేర నిధులు ఉన్నా... విమానం కొనుగోలుకు మాత్రం విరాళాలు సేక‌రించాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News