Ali: వైసీపీని అలీ వీడుతున్న‌ట్లు వార్తలు.. కొట్టిపారేసిన టాలీవుడ్ క‌మెడియ‌న్‌

yollywood comedian ali fires on fake news on his political career
  • త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌న్న అలీ
  • వైసీపీలో చేరింది ప‌ద‌వుల కోసం కాద‌న్న న‌టుడు
  • జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌నే ల‌క్ష్యంతోనే వైసీపీలో చేరిన‌ట్టు వెల్ల‌డి
  • ప‌ద‌వుల కంటే జ‌గ‌న్ మ‌న‌సులో స్థాన‌మే త‌న‌కు ముఖ్య‌మ‌న్న క‌మెడియ‌న్‌
టాలీవుడ్ క‌మెడియ‌న్ అలీ వైసీపీ నేత‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కూడా చేశారు. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ను క‌లిసిన అలీకి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఖాయ‌మంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌లేవీ వాస్త‌వ రూపం దాల్చ‌క‌పోగా... తాజాగా వైసీపీకి అలీ గుడ్‌బై చెప్ప‌బోతున్నారంటూ వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై అలీ తాజాగా స్పందించారు.

తాను వైసీపీని వీడుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అలీ తేల్చి చెప్పారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన అలీ... అయినా వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో తాను చేరింది పదవుల కోసం కాదని అలీ చెప్పారు. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే త‌న‌కు ముఖ్యమని ఆయ‌న పేర్కొన్నారు.
Ali
YSRCP
YS Jagan
Comedian
Tollywood

More Telugu News