Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కు అరెస్ట్ వారెంట్ జారీ

Arrest Warrant Against Producer Ekta Kapoor Over Web Series
  • సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న ఏక్తా కపూర్
  • 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్ సిరీస్ లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారని విమర్శలు
  • కేసు వేసిన మాజీ సైనికుడు శంభు కుమార్
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సరీస్ లను కూడా నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నారు. తన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడానికి ఆమె 'ఆర్ట్ బాలాజీ' అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఆమె 'ఎక్స్ఎక్స్ఎక్స్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ రెండు సీన్లు మంచి వ్యూస్ ని సాధించాయి. తాజా సిరీస్ లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారని విమర్శలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, బీహార్ లోని బేగుసరైలో ఈ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ లపై కేసు నమోదయింది. 2020లో శంభు కుమార్ అనే మాజీ సైనికుడు వీరిపై కేసు వేశారు. కేసు విచారించిన కోర్టు ఏక్తా, శోభలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఎంతో పేరు ఉన్న ఏక్తాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడల్ట్ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం దురదృష్టకరమని విమర్శిస్తున్నారు.
Ekta Kapoor
Bollywood
XXX Web Series

More Telugu News