Chiranjeevi: 'నేను ఎప్పుడు రాయలసీమ వచ్చినా ఆ నేల తడుస్తుంది: చిరంజీవి

Godse Movie Pre Release Event
  • అనంతపురంలో జరిగిన 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వర్షం వలన కలిగిన అంతరాయం 
  •  తడుస్తూనే మాట్లాడిన చిరంజీవి
  • ఇది శుభ పరిణామం అంటూ హర్షం  
  • అంత వర్షంలోను కదలని అభిమానులు
'గాడ్ ఫాదర్' .. ఇప్పుడు మెగా అభిమానులందరూ ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుక మధ్యలో వర్షం మొదలైంది. అంత వర్షంలోను చిరంజీవి తడుస్తూనే తన ప్రసంగాన్ని మొదలెట్టారు. 

"నిజంగా నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈ రోజున నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను రాజకీయాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు గానీ, 'ఇంద్ర' సినిమాలో వర్షం పాట సమయంలోను వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఇలా వర్షం కురవడం నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తోంది. థ్యాంక్యూ వరుణ దేవా .. థ్యాంక్యూ సోమచ్. 

నేను పూర్తిగా మాట్లాడేముందు ఒక మాట. ఈ రోజు ఉదయం ఒక విషాదం చోటుచేసుకుంది. కృష్ణగారి సతీమణి  .. సోదరుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవిగారు కాలం చేశారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని ఈ గాడ్ ఫాదర్ స్టేజ్ నుంచి తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు..
Chiranjeevi
Salman Khan
Mohan Raja
God Father Movie

More Telugu News