MS Dhoni: విజయవాడలో ధోనీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న వీరాభిమానులు

Dhoni statue in Vijayawada
  • విగ్రహ నిర్మాణం పూర్తి
  • చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ విగ్రహం
  • త్వరలో ప్రతిష్టాపన
భారత క్రికెట్ పై ఎంఎస్ ధోనీ ప్రభావం చాలా ఉంది. చిన్న పట్టణాల నుంచి వచ్చిన ఆటగాళ్లు కూడా జాతీయ జట్టుకు ఎంపిక కావొచ్చని, ప్రతిభ ఉంటే కెప్టెన్ అవ్వొచ్చని నిరూపించిన ఆటగాడు ధోనీ. 

ధోనీ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్, 50 ఓవర్ల వరల్డ్ కప్ లను గెలుచుకోవడమే కాకుండా, టెస్టుల్లోనూ అగ్రశ్రేణి జట్టుగా ఎదిగింది. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగు టైటిళ్లు అందించిన ధోనీ తన కెరీర్ ను మరింత ఫలప్రదం చేసుకున్నాడు. 

ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా, అతడి అభిమాన సైన్యం చెక్కుచెదరలేదు. తాజాగా, విజయవాడలో ధోనీ విగ్రహం ఏర్పాటు చేస్తుండడమే అందుకు నిదర్శనం. ఈ విగ్రహ నిర్మాణం పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించిన ధోనీ చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా ఈ విగ్రహం ఉంది. 

త్వరలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని బెజవాడలో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
MS Dhoni
Statue
Vijayawada
CSK
Team India
IPL

More Telugu News