Tirupati: 'తిరుపతి గోడలపై వైసీపీ రంగులు' ఆరోపణలపై... ఫ్యాక్ట్ చెక్ తో వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

  • ఎస్వీ వర్సిటీ రోడ్డులో గోడలపై దేవతల బొమ్మలు తొలగింపు
  • వైసీపీ రంగులు వేస్తున్నారంటూ ఆరోపణలు
  • వెలిసిపోయిన చిత్రాలను తొలగిస్తున్నామన్న సర్కారు
  • జాతీయనేతల చిత్రాలు పెయింట్ చేస్తున్నట్టు వివరణ
AP Govt clarifies YCP Colours on Tirupati walls

తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ రోడ్డులో గోడలపై హిందూ దేవతల బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేస్తున్నారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. 

తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నదని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి, వాటి స్థానంలో కొత్త కళాకృతులను చిత్రీకరించే పనులు కొనసాగుతున్నాయని వివరణ ఇచ్చింది. అందులో భాగంగా జాతీయనేతల చిత్రాలను నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో గోడలపై చిత్రిస్తున్నట్టు వెల్లడించింది. 

ఈ నగర సుందరీకరణ కార్యక్రమం దశల వారీగా జరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది. అంతగా బాధపడిపోతున్న నేతలు ఒకసారి వచ్చి ఇక్కడ చేపడుతున్న కళాకృతులను చూసి, అభినందించాల్సిందిగా కోరుతున్నామని సూచించింది.

More Telugu News