BJP: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ స‌ర్కారు

union cabinet approves 4 percent da hike to cemtral government employess
  • ఉద్యోగుల డీఏను 4 శాతం మేర పెంచిన కేంద్రం
  • మూల వేత‌నంలో 38 శాతానికి చేరిన డీఏ
  • 50 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, 62 ల‌క్ష‌ల మంది పింఛ‌న్‌దారుల‌కు ల‌బ్ధి
  • రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ కూడా పెరగ‌నున్న‌ట్లు క‌థ‌నాలు
ద‌స‌రా పండుగ ముందు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు న‌రేంద్ర మోదీ స‌ర్కారు తీపి క‌బురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డియ‌ర్‌నెస్ అల‌వెన్స్ (డీఏ)ను మ‌రో 4 శాతం పెంచుతున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

తాజా డీఏ పెంపుతో కేంద్ర ప్ర‌భుత్య ఉద్యోగుల డీఏ శాతం మూల వేతనంలో 38 శాతానికి చేరింది. ఈ డీఏ పెంపు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు పింఛ‌న్‌దారుల‌కు కూడా వ‌ర్తించ‌నున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో 50 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, 62 ల‌క్ష‌ల మంది పింఛ‌న్‌దారుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ పెంపుతో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ కూడా పెరిగే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
BJP
Union Cabinet
Prime Minister
Narendra Modi
DA

More Telugu News