Mahesh Babu: జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించిన మహేశ్ బాబు

Mahesh Babu did last rites to his mother Indira Devi
  • అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి
  • పద్మాలయా స్టూడియోస్ నుంచి అంతిమయాత్ర
  • భారీగా తరలివచ్చిన అభిమానులు

అగ్రనటుడు కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించారు. మహేశ్ బాబు తల్లికి అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేశ్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య ఇందిరాదేవికి కడసారి వీడ్కోలు పలికారు. 

అంతకుముందు, పద్మాలయా స్టూడియోస్ నుంచి ఇందిరాదేవి అంతిమయాత్ర జరిగింది. ఘట్టమనేని కుటుంబీకులు, బంధుమిత్రులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాగా, నాయనమ్మ భౌతికకాయం వద్ద మహేశ్ బాబు కుమార్తె సితార వెక్కివెక్కి ఏడ్వడం ఓ వీడియోలో దర్శనమిచ్చింది. ఓవైపు ఎంతో బాధలో ఉన్న మహేశ్ బాబు, కుమార్తెను ఓదార్చుతూ కనిపించారు.

  • Loading...

More Telugu News