Pawan Kalyan: కృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys condolences to Kriahna family
  • కన్నుమూసిన ఇందిరాదేవి
  • విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన  
ప్రముఖ నటులు కృష్ణ గారి సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఇందిరాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ బాధ నుంచి కృష్ణ గారు, మహేశ్ బాబు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వివరించారు. 

కాగా, పద్మాలయా స్టూడియోస్ లో ఉంచిన ఇందిరాదేవి భౌతికకాయాన్ని టాలీవుడ్ ప్రముఖులు సందర్శిస్తున్నారు. విషాదంలో మునిగిన కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
Pawan Kalyan
Condolences
Krishna
Mahesh Babu
Indira Devi
Demise

More Telugu News