మహేశ్ మూవీ టైటిల్ దాదాపు అదేనట!
- త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్ బాబు
- దసరా తరువాత సెకండ్ షెడ్యూల్ మొదలు
- కథానాయికగా పూజ హెగ్డే
- టైటిల్ గా 'అయోధ్యలో అర్జునుడు' ఖరారైనట్టే
ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి, అభిమానులంతా టైటిల్ విషయంలో ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. త్రివిక్రమ్ కి సినిమా టైటిల్స్ విషయంలో 'అ' సెంటిమెంట్ ఉంది. 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' సినిమాల తరువాత ఆయన చేస్తున్న ఈ సినిమా టైటిల్ కూడా 'అ' తోనే మొదలవుతుందని అంటున్నారు.
కథను బట్టి ఈ సినిమాలో 'అయోథ్యలో అర్జునుడు' అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయదశమి రోజున ఈ టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. దాదాపు ఈ టైటిల్ ఖరారైనట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఆమెకి ఈ ఇద్దరితోను హిట్లు ఉండటం అంచనాలు పెరగడానికి మరో కారణమవుతోంది.