JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 120 మందిపై పోలీసు కేసు నమోదు

Police filed case against JC Prabhakar Reddy
  • వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ జేసీ ఆందోళన 
  • పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారంటూ కేసు నమోదు
  • ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న పోలీసులు
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ... అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చట్ట విరుద్ధంగా నిరసన తెలిపారంటూ ఆయనతో పాటు మరో 120 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. వైసీపీ ఆగడాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా ఆందోళనకు దిగి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
JC Prabhakar Reddy
Telugudesam
Police Case

More Telugu News