వాన్‌పిక్ భూములను జప్తు నుంచి విడుదల చేయండి... ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
- జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ భూములను జప్తు చేసిన ఈడీ
- ఆ భూముల్లో 1,416 ఎకరాలను జప్తు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు
- మిగిలిన 11,804 ఎకరాలపై నవంబర్ 14న విచారణ
జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చెందిన మొత్తం 13 వేలకు పైగా ఎకరాల భూములను ఈడీ జప్తు చేసింది. క్విడ్ ప్రోకో పద్ధతిన జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కారణంగానే... వాన్‌పిక్‌కు నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు వేలాది ఎకరాల భూములను కేటాయించినట్లు సీబీఐ కేసు నమోదు చేయగా... సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.