Gautam Adani: మిత్రదేశాలతోనూ కయ్యం.. చైనా క్రమంగా ఒంటరి అయిపోతోంది: గౌతమ్ అదానీ

  • సింగపూర్‌ లో జరిగిన 20వ ఎడిషన్‌ ఫోర్బ్స్‌ గ్లోబల్‌ సీఈవోల కాన్ఫరెన్స్‌ లో ప్రసంగం
  • చైనాలో స్థిరాస్తి రంగం కుప్పకూలిపోవడం సంక్షోభానికి సూచిక అని వ్యాఖ్య
  • కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుందని హెచ్చరిక
Gautam adani said china will feel increasingly isolated

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, చైనాలో అంతర్గత వ్యవహారాల కారణంగా చైనా క్రమంగా ఒంటరిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ అన్నారు. పెరుగుతున్న జాతీయవాదం, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, సాంకేతిక నియంత్రణల వల్ల చైనా తమ పొరుగు దేశాలు, మిత్ర దేశాలతో కూడా దూరమవుతోందని.. ఏకాకి అవుతోందని పేర్కొన్నారు. సింగపూర్‌ లో జరిగిన 20వ ఎడిషన్‌ ఫోర్బ్స్‌ గ్లోబల్‌ సీఈవోల కాన్ఫరెన్స్‌ లో అదానీ మాట్లాడారు. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ ను చాలా దేశాలు తిరస్కరిస్తున్నాయని చెప్పారు.
 
స్థిరాస్తి రంగం కుప్పకూలడం సంక్షోభమే..
చైనాలో స్థిరాస్తి రంగం కుప్పకూలిపోవడం సంక్షోభానికి సూచిక అని అదానీ పేర్కొన్నారు. కరోనాతోపాటు పలు ఇతర అంశాల్లో చైనా ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలు దువ్విందని.. మిత్రదేశాలతోనూ అలాగే వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం తరహా పరిస్థితి ఉందని.. ఈ ఆర్థిక మార్పులు కాలక్రమేణా సర్దుకున్నా, కొంత కష్టమైన పరిస్థితేనని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని.. ఇది ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News