ఘీంకరించిన ఐరావతం 'గాడ్ ఫాదర్' .. లిరికల్ సాంగ్ రిలీజ్

27-09-2022 Tue 18:11
  • 'గాడ్ ఫాదర్' గా చిరంజీవి 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • అనంత శ్రీరామ్ రాసిన నేపథ్య గీతం 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్
God Father lyrical song released
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమాకి చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్  5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పుంజుకున్నాయి. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేశారు. 'నజ భజ జజర .. నజ భజ జజర .. గజ గజ వణికించే గజరాజాదిగోరా' అంటూ ఈ పాట సాగుతోంది. చిరంజీవి యాక్షన్ సీన్స్ పై .. మేకింగ్ వీడియోపై ఈ పాటను కట్ చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, శ్రీకృష్ణ -  పృథ్వీ చంద్ర ఆలపించారు.

'గాడ్ ఫాదర్' గా హీరో ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని చెబుతూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకు మెగా అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.