Bonda Uma: జగన్ కేసులు వాదిస్తున్న సీనియర్ లాయర్లకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు: బొండా ఉమ

  • ప్రభుత్వ కేసులకు కూడా ప్రైవేట్ లాయర్లను నియమించుకుంటున్నారన్న ఉమ 
  • నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించిందని వెల్లడి 
  • ప్రైవేట్ లాయర్లకు కోట్లాది రూపాయలు చెల్లించడం అన్యాయమని విమర్శ 
Public money being paid to Jagan cases also says Bonda Uma

  జగన్ సీఎం అయినప్పటి నుంచి వివిధ కేసుల కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. తన అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులను వాదిస్తున్న లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుండటం విడ్డూరమని చెప్పారు. జగన్ వ్యక్తిగత కేసులను వాదిస్తున్న సీనియర్ లాయర్లకు ప్రభుత్వ కేసుల రూపంలో కోట్లాది రూపాయలను చెల్లిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కేసులకు కూడా ప్రభుత్వ లాయర్లను నియమించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్రభుత్వ కేసులకు ప్రైవేట్ లాయర్లను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు సైతం నివ్వెరపోయిందని... న్యాయవాదులపై పెడుతున్న ఖర్చులపై నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించిందని బొండా ఉమ అన్నారు. ప్రైవేట్ న్యాయవాదులకు వందల కోట్లను ఫీజుగా చెల్లించడం దారుణమని చెప్పారు. పోలవరంపై గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు వెళ్తే... దానికి కూడా ప్రైవేట్ లాయర్ ను పెట్టుకుంటారా? అని విమర్శించారు.

More Telugu News