'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

  • కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'బింబిసార'
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
  • ఇటీవలే 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా 
  • జీ 5లో అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ 
Bombisara Movie Update

కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' సినిమా తెరకెక్కింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి శ్రీ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. చారిత్రక నేపథ్యం ..  టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఈ సినిమాను కొత్తగా ఆవిష్కరించాయి. 

విభిన్నమైన కథాకథనాలు .. బలమైన ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. ఇటీవలే ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి అంతా ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జీ 5 వారు అక్టోబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. థియేటర్లలో ఒక రేంజ్ లో సందడి చేసిన ఈ సినిమా, ఓటీటీ సెంటర్ నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ అలరించిన సంగతి తెలిసిందే.

More Telugu News