Bollywood: బాలీవుడ్ న‌టి ఆశా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Asha Parekh to be honoured with Dadasaheb Phalke Award
  • 2020 ఏడాది ఫాల్కే అవార్డుకు ప‌రేఖ్ ఎంపిక‌
  • ప‌దేళ్ల వ‌య‌సుకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌రేఖ్‌
  • ఈ నెల 30న అవార్డును స్వీక‌రించ‌నున్న సీనియ‌ర్ న‌టి
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి ఆశా ప‌రేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక‌య్యారు. 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డుకు ప‌రేఖ్ ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ మంగ‌ళవారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 68వ జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఫాల్కే అవార్డును ప‌రేఖ్ స్వీక‌రించ‌నున్నారు. 

1942 అక్టోబ‌ర్ 3న గుజ‌రాతీ కుటుంబంలో జ‌న్మించిన ప‌రేఖ్‌... బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1952లో వ‌చ్చిన 'మా' చిత్రంతో తెరంగేట్రం చేసిన ప‌రేఖ్‌... బాలనటిగా చిత్ర సీమ‌లో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఆమెకు మంచి గుర్తింపు ల‌భించింది. 1959లో విడుద‌లైన 'దిల్ దేకే దేఖో' చిత్రంతో ఆమె హీరోయిన్‌గా మారారు. క‌తీ ప‌తంగ్‌, మేరా గావ్ మేరా దేశ్‌, తీర్సీ మంజిల్ వంటి చిత్రాలు ప‌రేఖ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Bollywood
Dadasaheb Phalke Award
Asha Parekh

More Telugu News