Tirumala: ​​నేడు ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం​​​​​​​​

  • సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు బ్రహ్మోత్సవాలు
  • బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న టీటీడీ
  • భక్తులు సహకరించాలని విజ్ఞప్తి
All set for Tirumala Brahmotsavam

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి అక్టోబరు 5 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేడు ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 

ఈ నేపథ్యంలో, భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు విజ్ఞప్తులు చేసింది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తులు కూడా తమకు సహకరించాలని కోరారు. 

తిరుమాడ వీధుల్లో స్వామివారి వాహన సేవలు జరిగే సమయంలో భక్తులు నాణేలు విసరొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా విసిరే నాణేలు అర్చకులు, వాహనసేవకులను గాయపరిచే అవకాశముందని తెలిపారు. 

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల కొండపై ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం ఉన్నందున భక్తులు తాగునీటి కోసం స్టీల్ గ్లాసులు, స్టీల్ బాటిళ్లు తెచ్చుకోవాలని తెలిపారు.

More Telugu News