Kanna Lakshminarayana: దేశంలో అత్యంత ధనవంతుడు కావడమే జగన్ లక్ష్యం: కన్నా లక్ష్మీనారాయణ

Jagan wants to become richest in India says Kanna Lakshminarayana
  • రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి జగన్ దోచుకుంటున్నారన్న కన్నా 
  • జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని పిలుపు 
  • పోలవరం ప్రాజెక్టును నిర్మించడం చేతకాకపోతే తప్పుకోవాలని డిమాండ్ 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. దేశంలోనే అంత్యంత ధనవంతుడు కావాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం చేస్తోందని అన్నారు. ఏపీలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని చెప్పారు. 

జగన్ పాలనలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని... ఆయన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని అన్నారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం చేతకాకపోతే తప్పుకోవాలని... తామే ప్రాజెక్టును నిర్మిస్తామని కన్నా చెప్పారు.
Kanna Lakshminarayana
bjp
Jagan
YSRCP
Polavaram Project

More Telugu News