హీరో మోటోకార్ప్ వాహన విక్రయాలపై పండుగ ఆఫర్లు

27-09-2022 Tue 13:22 | National
  • స్కూటర్లపై సూపర్ 6 ధమాకా ప్యాకేజీ
  • ప్రీమియం శ్రేణిపై రూ.5,000 ఎక్చేంజ్ బోనస్
  • బై నౌ, పే లేటర్ సదుపాయం
Hero MotoCorp announces new offers schemes under festive campaign
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ దసరా పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది. గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్ పేరుతో ప్రచారాన్ని మొదలు పెట్టింది. హీరో ప్రీమియం శ్రేణి వాహనాలపై రూ.5,000 ఎక్చేంజ్ బోనస్ ఇస్తోంది. త్వరలోనే కంపెనీ వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎనిమిది కొత్త  మోడళ్లను విడుదల చేయనుంది. 

హీరో మోటోకార్ప్ స్కూటర్లు ‘సూపర్ 6 ధమాకా’ ప్యాకేజీతో వస్తాయి. దీని కింద రూ.13,500 ప్రయోజనాలను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఏడాది పాటు ఉచిత బీమా, రెండేళ్ల పాటు ఉచిత మెయింటెనెన్స్, రూ.3,000 ఎక్చేంజ్ బోనస్, రూ.4,000 గుడ్ లైఫ్ గిఫ్ట్ వోచర్లు, ఐదేళ్ల వారంటీ, ఆరు నెలల పాటు సున్నా వడ్డీకే ఈఎంఐ సదుపాయాలను ఇస్తోంది. ‘ఇప్పుడు కొను తర్వాత చెల్లించు’ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కస్టమర్లు కంపెనీని సంప్రదించొచ్చు.