Deepak Chahar: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఆల్ రౌండర్ సోదరి

Team India all rounder Deepak Chahar sister Malti Chahar enters Bollywood
  • బాలీవుడ్ లో అడుగుపెట్టిన దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్
  • ఇప్పటికే సూపర్ మోడల్ గా రాణిస్తున్న మాలతి
  • ఇన్స్టాలో 10 లక్షలకు పైగా ఫాలోయర్లను కలిగిన మాలతి
టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వృత్తి రీత్యా ఆమె ఇప్పటికే సూపర్ మోడల్ గా రాణిస్తోంది. ఇప్పటికే ఆమె పలు టీవీ షోలలో కనిపించింది. సోషల్ మీడియాలో మాలతీ చాహర్ కు చాలా ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 10 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. 

మరోవైపు, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మాలతి వీరాభిమాని. 'ఇష్క్ పష్మినా' చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది. భవిన్ భానుశాలి, మాలతి హీరోహీరోయిన్లుగా, ఒక ప్రేమ కథా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు మోడల్ గా రాణించిన మాలతీ చాహర్... వెండితెరపై ఎంత మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
Deepak Chahar
Sister
Malti Chahar
Bollywood

More Telugu News