Pavan kalyan: పవన్ ను అంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు: శివాజీ రాజా

  • శ్రీరెడ్డి ఇష్యూపై తాజా ఇంటర్వ్యూలో స్పందించిన శివాజీరాజా
  • నన్ను ప్రెసిడెంట్ గా ఉంచనని పవన్ అన్నారంటూ వెల్లడి  
  • తాను చెప్పింది పవన్ వినిపించుకోలేదంటూ ఆవేదన 
  • పవన్ ను అలా కలుస్తానని అనుకోలేదంటూ వ్యాఖ్య
Shivaju Raja Interview

శివాజీ రాజా 'మా' అధ్యక్షుడిగా ఉన్నప్పుడే శ్రీరెడ్డి రచ్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగవలసి వచ్చింది. అప్పుడు గాని ఈ రచ్చకు తెరపడలేదు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజాకి ఆ ఇష్యూకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. 

నా హయాంలోనే శ్రీరెడ్డికి సంబంధించిన ఇష్యూ జరిగింది. అప్పుడు పవన్ కల్యాణ్ గారు నేరుగా 'మా' ఆఫీసుకి వచ్చారు. నాగశౌర్య 'నర్తనశాల' షూటింగులో నేను ఉండగా నన్ను పవన్ రమ్మంటున్నట్టుగా కాల్ వచ్చింది. షూటింగు మధ్యలోనే నేను వచ్చేశాను. శ్రీ రెడ్డిపై 'మా' వైపు నుంచి నేను కోర్టులో కేసు వేయలేదని పవన్ అనుకున్నారు. నేను ఆఫీసుకి వెళ్లే సరికి పవన్ చాలా కోపంగా ఉన్నారు. అంత కోపంగా ఆయనను ఎప్పుడూ చూడలేదు. 

జరిగింది నేను చెబుతూ ఉంటే కనీసం ఆయన 'ఊ' కొట్టకుండా అక్కడున్న స్తంభం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 'నెక్స్ట్ నిన్ను ప్రెసిడెంట్ గా ఉంచను' అన్నారు. శ్రీరెడ్డిపై నేను తీసుకున్న యాక్షన్ పేపర్ ను పవన్ కి చూపించాను. ఛాంబర్ లో ఉన్న లాయర్ కి ఇవ్వమని అన్నారు. లోపలికి వెళితే అది కోర్టు హాలు మాదిరిగా కనిపించింది. ఒక్క జడ్జిగారే లేరు తప్పితే చాలామంది లాయర్లు ఉన్నారు. అందులో ఒకరికి ఆ పేపర్ అందజేశాను. నా మిత్రుడైన పవన్ ను అలా కలుసుకోవలసి వచ్చినందుకు చాలా బాధపడ్డాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News