Fertility rate: దేశంలో గత పదేళ్లలో 20 శాతం తగ్గిన సంతానోత్పత్తి

Fertility rate declined by 20 percent in India in 10 years SRS data
  • తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణం
  • ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతం
  • గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాలే నయం
నేటి తరం మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) 20 శాతం తగ్గినట్టు ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020’ తెలిపింది. ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జీఎఫ్ఆర్ గా చెబుతారు. 15-49 సంవత్సరాల వయసులోని వారిని ఈ గణాంకాల పరిధిలోకి తీసుకుంటారు. జమ్మూకశ్మీర్ లో జీఎఫ్ఆర్ 29 శాతం తగ్గిపోయింది.  

2008 -2010లో సగటు జీఎఫ్ఆర్ 86.1గా ఉంటే, 2018-20 మధ్య కాలంలో ఇది 68.7కు తగ్గింది. చిత్రమేమిటంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. 

జీఎఫ్ఆర్ గణాంకాలు జనాభావృద్ధి తగ్గుదలను సూచిస్తున్నాయని, ఇది మంచి సంకేతమేనని ఎయిమ్స్ ఆబ్సెట్రిక్స్ మాజీ హెడ్ సునీతా మిట్టల్ అన్నారు. వివాహం చేసుకుంటున్న వారి వయసు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక సంతాన నిరోధక సాధనాల రాక సంతానోత్పత్తి తగ్గడానికి కారణం. 

తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటును పరిశీలిస్తే ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతంగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీలో 28.5 శాతం మేర ఉంది.
Fertility rate
declined
20 percent
india
study

More Telugu News