తిరుపతి సమీపంలో బెంజ్ కారును ఢీకొని రెండుముక్కలైన ట్రాక్టర్: వీడియో ఇదిగో

  • చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఘటన
  • రాంగ్‌ రూట్‌లో వచ్చి ఢీకొట్టిన ట్రాక్టర్
  • స్వల్ప గాయాలతో బయటపడిన ట్రాక్టర్ డ్రైవర్
  • కారు ముందు భాగం ధ్వంసం
Tractor breaks into 2 parts after collision with Mercedes near Tirupati

తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్ రెండు ముక్కలు అయింది. రాంగ్ రూటులో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. 

ప్రమాదం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ట్రాక్టర్ కంటే మెర్సిడెస్ బలమైనదని ఈ ఘటనతో నిరూపితమైందంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

More Telugu News