AAP: స‌ఫాయి కార్మికుడి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

delhi cm arvind kejriwal offers lunch for a gujarati safai karmikin his gouse
  • గుజ‌రాత్‌కు చెందిన స‌ఫాయి కార్మికుడు హ‌ర్ష్ సోలంకి
  • హ‌ర్ష్‌కు ఢిల్లీలోని త‌న నివాసంలో విందు ఇచ్చిన కేజ్రీవాల్‌
  • కేజ్రీ ఆతిథ్యంతో భావోద్వేగానికి గురైన కార్మికుడు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఏం చేసినా ప్ర‌త్యేక‌మే. మొన్న‌టికి మొన్న గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంటికి అత‌డి ఆటోలోనే వెళ్లి... డ్రైవ‌ర్ కుటుంబంతో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేసిన కేజ్రీవాల్... తాజాగా సోమ‌వారం గుజ‌రాత్‌కు చెందిన స‌ఫాయి కార్మికుడు హ‌ర్ష్ సోలంకి కుటుంబాన్ని త‌న ఇంటికి పిలిచి మ‌రీ కార్మికుడి కుటుంబానికి భోజ‌నం పెట్టారు. 

స‌ఫాయి కార్మికుడి కుటుంబంతో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఒకే టేబుల్‌పై కూర్చోబెట్టుకుని ఆయ‌న భోజ‌నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు జాతీయ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కేజ్రీవాల్ ఇచ్చిన ఆతిథ్యానికి హ‌ర్ష్ సోలంకి క‌న్నీటిని ఆపుకోలేక‌పోయారు. త‌ల్లి, చెల్లితో క‌లిసి గుజ‌రాత్ నుంచి హ‌ర్ష్ సోలంకి ఢిల్లీ రాగా.. అత‌డి ప్ర‌యాణానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్ల‌న్నీ ఆప్ నేత‌లే చూసుకున్నారు.
AAP
Arvind Kejriwal
Delhi CM

More Telugu News