పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్, కోహ్లీ సంబరాలు.... వీడియో ఇదిగో!

26-09-2022 Mon 18:18
  • నిన్న హైదరాబాదులో మ్యాచ్
  • ఆస్ట్రేలియాపై నెగ్గిన టీమిండియా
  • 2-1తో సిరీస్ భారత్ కైవసం
  • టీమిండియా శిబిరంలో ఆనందోత్సాహాలు
Rohit Sharma and Virat Kohli celebrates after Hardik Pandya hit winning shot
హైదరాబాదులో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ అభిమానులను ఎంతగానో అలరించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరగడం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాగా, లక్ష్యఛేదనలో హార్దిక్ పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే టీమిండియా శిబిరంలో సంబరాలు చేసుకున్నారు. 

చివరి ఓవర్లో సిక్స్ కొట్టి, ఆ తర్వాత బంతికే అవుటైన కోహ్లీ... డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లకుండా మెట్లపైనే కూర్చున్నాడు. కోహ్లీ పక్కనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కూర్చుని మ్యాచ్ ను ఉత్కంఠతో వీక్షించారు.

పాండ్యా ఫోర్ కొట్టి మ్యాచ్ గెలిపించగా, రోహిత్ శర్మ, కోహ్లీ ఆనందం అంతాఇంతా కాదు. ఒకరినొకరు హత్తుకుని అభినందించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా సిరీస్ ను 2-1తో కైవసం చేసుకోవడం తెలిసిందే. అక్టోబరులో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ సిరీస్ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.