అక్టోబర్​ 11 నుంచి తెలంగాణ ఎంసెట్​ రెండో విడత కౌన్సెలింగ్​

26-09-2022 Mon 17:32
  • సెప్టెంబర్ 28 నుంచే జరగాల్సిన రెండో విడత కౌన్సెలింగ్
  • ఇంజనీరింగ్ ఫీజులపై తేలకపోవడంతో వాయిదాకు నిర్ణయం
  • అక్టోబర్ 16న సీట్లు కేటాయిస్తామని ప్రకటన
TS eamcet second phase counselling postponed
తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల అంశంపై వివాదం, దానిపై కోర్టు ఆదేశాలు, ఇతర అంశాలు తేలకపోవడంతో.. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ ను వాయిదా వేస్తున్నామని.. తిరిగి అక్టోబర్‌ 11 నుంచి ఇది ప్రారంభం అవుతుందని తెలిపింది. అక్టోబర్‌ 11, 12వ తేదీలలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని.. అక్టోబర్‌ 12న రెండో విడత ధ్రువప్రతాల పరిశీలన ఉంటుందని వివరించింది.  ఇక 12, 13 తేదీల్లో విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకుంటే.. అక్టోబర్ 16న సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని వెల్లడించింది.