సీఎం జగన్ కు పవిత్ర 'జమ్ జమ్ వాటర్' ను అందించిన హజ్ కమిటీ సభ్యులు

26-09-2022 Mon 16:58
  • ముగిసిన హజ్ యాత్ర-2022
  • సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన హజ్ కమిటీ సభ్యులు
  • వారి వెంట మైనారిటీ ఎమ్మెల్సీలు
  • ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం జగన్
AP Haj Committee members met CM Jagan
ఏపీ సీఎం జగన్ ను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజమ్, హజ్ కమిటీ సభ్యులు మునీర్ బాషా, ముఫ్తీ బాసిత్, ఇబాదుల్లా ఖాదర్, మైనారిటీ ఎమ్మెల్సీలు ఇషాక్ బాషా, రుహుల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు.

ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో, హజ్ కమిటీ సభ్యులు ఆయనకు జమ్ జమ్ వాటర్ (పవిత్ర జలం)ను అందజేశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. సీఎం చేతికి రక్షా కంకణాన్ని కట్టారు. ఆయనకు ఆప్యాయంగా మిఠాయి తినిపించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ హజ్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీలతో ఆత్మీయంగా ముచ్చటించారు. హజ్ యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీలు, హజ్ కమిటీ సభ్యులు మైనారిటీలకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.