Alligator: వాటర్​ పార్క్​ లో వదిలితే అలా తేలుతూ వెళ్లిపోయింది.. వైరల్​​ అయిన మొసలి వీడియో ఇదిగో

  • అమెరికాలోని ఇల్లినాయిస్ వాటర్ పార్క్ లో ఘటన
  • ఏటా వేసవి ముగిశాక చివరి విజిటర్ గా మొసలిని తీసుకొచ్చే అధికారులు
  • ఈసారి కూడా తీసుకొస్తే.. నీటిలో మధ్యన తేలుతున్నట్టుగా ఎంజాయ్ చేసిన మొసలి
Alligator floats small river Illinois water park

సాధారణంగా మొసళ్లు బాగా యాక్టివ్ గా ఉంటాయి. ఉన్నంత సేపు ఓపిగ్గా కదలకుండా ఉన్నా.. అటూ ఇటూ వెళ్లినప్పుడు వాటి కదలికలు వేగంగానే ఉంటాయి. కానీ అమెరికాలోని ఓ జూపార్క్ లో ఒక మొసలి మాత్రం సోమరితనానికే చిరునామా అన్నట్టుగా, నీటి మధ్యలో అలా తేలిపోతూ ఉండటం చిత్రంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇల్లినాయిస్ వాటర్ పార్క్ లో..

  • అమెరికాలోని ఇల్లినాయిస్ వాటర్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇక్కడ ఎండాకాలం సీజన్ ముగుస్తుండగా వాటర్ పార్క్ ను మూసివేస్తారు. ఈ సందర్భంగా చివరి విజిటర్ గా ఒక మొసలిని తీసుకువచ్చి.. వాటర్ పార్క్ లోని చిన్నపాటి కాల్వలో వదులుతారు. ఆ మొసలి అందులో కావాల్సినంత సేపు తిరిగాక.. వాటర్ పార్క్ లోకి అధికారికంగా విజిటర్ల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.
  • ఈసారి అలా వాటర్ పార్క్ నిర్వాహకులు ది స్కావిల్ జూ నుంచి జీ అనే 39 ఏళ్ల మొసలిని తీసుకువచ్చారు. దానిని ఈ నీటి కాలువ ముందు వదిలారు.
  • మెల్లగా కాలువలోకి దిగిన మొసలి.. నీటిలో ఈదకుండా అలాగే ఉండిపోయింది. నీరు మెల్లగా ప్రవహిస్తున్న కొద్దీ అందులో కొట్టుకుపోతున్నట్టుగా ఉండిపోయింది. కనీసం నిలువుగా ఉండేందుకూ ప్రయత్నించలేదు.
  • అలా చాలా సేపు నీటిలో తేలుతున్నట్టుగా ఉండిపోయింది. అయితే అప్పుడప్పుడూ మాత్రం కాసేపు అటూ ఇటూ మెల్లగా కదిలింది. మొత్తానికి కాసేపటి తర్వాత మెల్లగా నీటిలోంచి బయటికి వచ్చి ఎండలో ఉండిపోయింది.
  • కొంతసేపటి తర్వాత ఆ మొసలిని అధికారులు జూకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షకుపైగా వ్యూస్ రాగా.. వేలాది లైక్ లు వచ్చాయి.
  • నిజానికి ఆ నీటి కాల్వను మొసలి బాగా ఇష్టపడిందని.. అందుకే అలా ప్రవర్తించి ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు.

More Telugu News