అత్తామామ‌ల‌ను తొలిసారి క‌లిసిన‌ హార్దిక్ పాండ్యా... గ్రేట్‌ఫుల్ మూమెంట్స్ అంటూ వీడియోను పోస్ట్ చేసిన క్రికెట‌ర్‌

26-09-2022 Mon 16:43
  • 2020లో సెర్బియా డ్యాన్స‌ర్ న‌టాషాను పెళ్లి చేసుకున్న హార్దిక్‌
  • ఇప్ప‌టిదాకా న‌టాషా త‌ల్లిదండ్రుల‌ను నేరుగా క‌ల‌వ‌ని పాండ్యా
  • సోమ‌వారం తొలి సారి భార్య కుటుంబాన్ని క‌లిసిన క్రికెట‌ర్‌
  • వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం
Hardik Pandya meets for the first time his wifes family on monday
టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ హార్దిక్ పాండ్యా సోమ‌వారం త‌న సోష‌ల్ మీడియా ఖాతాల వేదిక‌గా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సెర్బియాకు చెందిన డ్యాన్స‌ర్‌, మోడ‌ల్‌, న‌టి న‌టాషా స్టాన్‌కోవిక్‌ను హార్దిక్ 2020లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి జ‌రిగిన రెండేళ్లు దాటుతున్నా... అత‌డు ఇంకా తన అత్తామామ‌ల‌ను నేరుగా క‌లుసుకోలేద‌ట‌. ఎప్పుడైనా ఫోన్ కాల్స్‌, వీడియో కాల్స్‌లోనే వారితో మాట్లాడేవాడ‌ట‌. అయితే సోమ‌వారం తొలిసారిగా హార్దిక్ త‌న అత్తామామ‌ల‌ను నేరుగా క‌లుసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా రికార్డ్ చేసిన ఓ వీడియోను అత‌డు త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. 

త‌మ ఇంటికి తొలిసారి వ‌చ్చిన అల్లుడికి న‌టాషా త‌ల్లి రెడ్‌మిలా స్టాన్‌కోవిక్‌, తండ్రి గోరాన్ స్టాన్‌కోవిక్‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. వారి స్వాగ‌తానికి మురిసిపోయిన హార్దిక్‌... న‌టాషాతో పెళ్లి అయిన త‌ర్వాత ఆమె కుటుంబాన్ని తొలిసారిగా క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని వ్యాఖ్యానించాడు. ఇక‌పై న‌టాషా ఫ్యామిలీ కూడా త‌న ఫ్యామిలీనేన‌ని కూడా అత‌డు చెప్పుకొచ్చాడు. న‌టాషా ఫ్యామిలీని తొలిసారి క‌లిసిన క్ష‌ణాలు గ్రేట్‌ఫుల్ మూమెంట్స్ అంటూ సంబ‌ర‌ప‌డిపోయాడు.