క్రైమ్ థ్రిల్లర్ గా 'అథర్వ' .. సిమ్రాన్ చౌదరి ఫస్టులుక్ రిలీజ్!

26-09-2022 Mon 16:05
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే 'అథర్వ' 
  • ఆసక్తిని రేపుతున్న ఫస్టు లుక్
  • దర్శకుడిగా మహేశ్ రెడ్డి  పరిచయం 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Atharva movie first look released
ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల సంఖ్య పెరుగుతూపోతోంది. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ తరహా సినిమాలను నిర్మించే అవకాశం ఉంటుంది. పెద్ద క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు లేకపోయినా, కెమెరా పనితనం ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే చాలు మంచి లాభాలను రాబడతాయి. అందువలన ఈ తరహా కంటెంట్ పైనే కొత్త  దర్శకులు .. నిర్మాతలు దృష్టిపెడుతుంటారు. అలా రూపొందుతున్న సినిమానే 'అథర్వ'. 

కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా సిమ్రాన్ చౌదరి అలరించనుంది. సుభాశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సిమ్రాన్ చౌదరి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే కథానాయిక ఏదో ఆపదలో ఉన్నట్టుగా ... ఎలా తప్పించుకోవాలో తెలియక భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. 

ఫస్టు లుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచగలిగారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కబీర్ దుహాన్ సింగ్ .. ఐరా .. అరవింద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి మరి.