AP High Court: ఎమ్మెల్సీ అనంత‌బాబుకు బెయిల్ నిరాక‌రించిన హైకోర్టు

  • డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత‌బాబు
  • రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్ర కారాగారంలో విచార‌ణ ఖైదీగా ఎమ్మెల్సీ
  • పోలీసులు 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖ‌లు చేయ‌లేద‌న్న వైసీపీ బ‌హిష్కృత నేత‌
  • ఈ నిబంధ‌న ఆధారంగా త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థ‌న‌
  • పిటిష‌న్‌ను కొట్టివేసిన హైకోర్టు
ap high court dismisses mlc anantha babu bail petition

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన వైసీపీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అనంత‌బాబుకు సోమ‌వారం ఏపీ హైకోర్టులో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో రాజ‌కీయ దుమారం రేపిన డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న అనంత‌బాబు... ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్ర కారాగారంలో విచార‌ణ ఖైదీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే.

త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్ల‌ను రాజ‌మ‌హేంద్ర‌వరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇప్ప‌టికే కొట్టివేసింది. అయితే పోలీసులు చార్జిషీట్ దాఖ‌లులో జాప్యం చేశార‌ని ఆరోపించిన అనంత‌బాబు... నిర్ణీత 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖ‌లు చేయ‌లేద‌ని హైకోర్టుకు తెలిపారు. ఈ నిబంధ‌న ఆధారంగా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు అనంత‌బాబుకు బెయిల్‌ను నిరాక‌రించింది.

More Telugu News