'ఓరి దేవుడా.. మా ఆయ‌న‌ చొక్కాతోనూ మాట్లాడుతున్నాడంటున్న' షారూఖ్ భార్య గౌరీ

26-09-2022 Mon 14:29
  • చొక్కా లేకుండా సిక్స్ ప్యాక్ ఫొటోను షేర్ చేసిన షారూఖ్ 
  • త‌న చొక్కా కోసం సందేశం కూడా రాసిన బాలీవుడ్ బ‌డా స్టార్‌
  • వ‌చ్చే జ‌న‌వ‌రిలో ప‌ఠాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న షారూఖ్ 
Shah Rukh Khan shirtless pic gets the most hilarious comment from wife Gauri Khan
బాలీవుడ్ సీనియ‌ర్ హీరో షారూఖ్ ఖాన్ 56 ఏళ్ల వ‌య‌సులోనూ యువ న‌టుల‌తో పోటీ ప‌డుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ విష‌యంలో ఆయ‌న ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ప‌ఠాన్ సినిమా కోసం ఆయ‌న సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేశారు. చొక్కా లేకుండా త‌న కండ‌లు చూపిస్తున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా నువ్వు ఉంటే ఎలా ఉండేది.. అంటూ త‌న చొక్కా కోసం ఆయ‌న ప్ర‌త్యేక సందేశం కూడా రాశారు. తాను ప‌ఠాన్ చిత్ర కోసం ఎదురు చూస్తున్నాన‌ని తెలిపాడు. ఈ పోస్టుపై షారూఖ్ భార్య గౌరీ ఖాన్ స్పందించింది. ఓరి దేవుడా.. మా ఆయ‌న చొక్కాతో కూడా మాట్లాడుతున్నారు.. అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది. షారూఖ్ ష‌ర్ట్ లెస్ ఫొటోతో పాటు గౌరీ రియాక్ష‌న్ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 
 
షారూఖ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ప‌ఠాన్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టించ‌గా.. జాన్ అబ్ర‌హం కీల‌క పాత్ర పోషించాడు. షారూఖ్ చివ‌ర‌గా 2018లో జీరో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మూడేళ్లుగా మ‌రే సినిమా చేయ‌లేదు. అయితే, ర‌ణ్‌ బీర్ కపూర్‌, అలియా భ‌ట్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపించారు. వ‌చ్చే ఏడాది మాత్రం షారూఖ్ ప‌ఠాన్‌తో పాటు మ‌రో చిత్రాన్ని కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ప‌ఠాన్ త‌ర్వాత జూన్‌లో జ‌వాన్‌, డిసెంబ‌ర్ లో డుంకితో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్లాన్ చేశారు.