నిన్ను చూశాక ఇంకెవరినీ చూడాలనిపించడం లేదు: 'స్వాతి ముత్యం' ట్రైలర్ రిలీజ్!

26-09-2022 Mon 12:57
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'స్వాతిముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్  
Swathimuthyam Movie Trailer released
'స్వాతి ముత్యం' సినిమాతో బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సితార బ్యానర్ తో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో అలరించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం .. అది ప్రేమగా మారడం .. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలవరకూ వెళ్లే ప్రయాణంలో ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చినట్టుగా తెలుస్తోంది.

రావు రమేశ్ .. నరేశ్ .. వెన్నెల కిశోర్ .. ప్రగతి .. గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ  కథను అల్లుకున్నట్టుగా అనిపిస్తోంది. ఒక వైపున చిరూ 'గాడ్ ఫాదర్' .. మరో వైపున నాగ్ 'ది ఘోస్ట్'తో పాటు అదే రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుండటం విశేషం.